**మనూళ్ళో కుక్కలు వెంటపడతాయి వీళ్ళ వెనుక. **

వీళ్ళంతా మానసిక రోగులు. జనం తమకేసి చూడాలని తహతహలాడతారు. ఉన్నవాళ్ళలో అందమైనవాళ్ళని పెట్టారు కనుక వాళ్ళు ధీమాగా నడుస్తున్నారు కనుక మనకి విచిత్రంగా అనిపిస్తుంది. కానీ రోడ్డుమీద చింపిరి జుట్టేసుకుని స్నానపానాలు లేకుండా మీద ఈగలు వాల్తున్నా పట్టించుకోకుండా ఎండకీ వానకీ తడుస్తూ ఉంటే పిచ్చోళ్ళనుకుంటాం. పిచ్చి తక్కువ మోతాదులో ఉంది కనుక మనకి వాళ్ళు హాస్యం చేస్తాం. బాగా ముదిరింతర్వాత దయగలిగిన ఎవరో పెట్టిన ఏదో అనాధాశ్రంలో చేరతారు. కాస్త స్నానం అవీ చేయించి తిండిపెడితే ఓ మూల మూలుగుతూ కూర్చుంటారు. ముందుగానే ఇది మానసిక వ్యాధి అని గ్రహించి వైద్యుడికి చూపించండి. దీనికి నిపుణులున్నారు. వాళ్ళ పేరు సైకాలజిస్టులు వాళ్ళు కౌన్సలింగ్ మాత్రమే చేస్తారు. సైకియాట్రిస్ట్ పిచ్చి ముదిరినవాళ్ళకి మందులు, మాకులిచ్చి నయం చేస్తారు. మీ ఇంట్లో వాళ్ళు విచిత్రంగా ప్రవర్తిస్తుంటే ముందు సైకాలజిస్ట్, తర్వాత సైకియాట్రిస్ట్ కు చూపించాల్సొస్తుంది. మీ పిల్లలు ఇలా తలకి పిచ్చి పిచ్చి రంగులేసుకుని, బట్టలు చింపుకుని దరిద్రుల్లా ప్రవర్తిస్తుంటే మీకు చెప్పడం చేతకాకపోతే నిపుణులని అర్జంటుగా సంప్రదించండి. లేకపోతే ఎక్కడో అనాధాశ్రమాల్లో తేల్తారు. మా ఆశ్రమంలో ఇప్పటికి ఓ నూటాభై మందున్నారు. మీరు డొనేషన్లిస్తే ఇంకా చాలా బిల్డింగులు కట్టి మీ పిచ్చి పిల్లలకీ చోటుంచుతాం.

మనిషన్నవాడికి జనం మన్ని పట్టించుకోవాలని తమని మెచ్చుకోవాలని ఉండడం సహజం. అది తగు మోతాదులో ఉంటే ఎవరూ అది వ్యాధి అనుకోరు. మంచి బట్టలు కట్టుకోవడం వేరు ఇతరుల దృష్టి ఆకర్షించుకోవడానికి ఖరీదైన బ్రాండెడ్ బట్టలు కట్టుకోవడం. ఓ పదివేల యాండ్రోయిడ్ ఫోన్ కొనుక్కోవడం వేరు ఓ లక్షెట్టి యాపిల్ ఫోన్ అదే పనితీరున్నది కొనుక్కోవడం వేరు. ఇలా చెప్పుకుంటే లక్షాతొంభై రకాల విధానాలున్నాయి. ఒరే నన్ను చూడండ్రా పట్టించుకోండ్రా అని ఆర్తనాదాలు. యండమూరి భాషలో అది ప్రేమరాహిత్యం. ఏదోలా ఓ పదవి చిక్కించుకోవడం, ఎన్నున్నాయో లెక్కనేనన్ని ఆస్తులు కూడబెట్టుకోవడం ఇలా మానసిక వ్యాధి లక్షణాలే. ఎటొచ్చీ వాటికోసం జనాన్ని దోపిడి చేయడం నగలూ నట్రా కోసం మొగుణ్ణి రాచి రంపానపెట్టడం కార్టూన్లకీ కామెడీకీ బానే ఉంటుంది. కానీ పక్కోడికది నరకం అవుతుంది. ముఖ్యంగా ఈ జబ్బు మీకుంటే ముందు సైకాలజిస్టుకీ వాడి వల్లా కాకుంటే సైకియాట్రిస్టుకీ చూపించుకోండి.

సాధారణంగా మానసిక ఆరోగ్యం బాగున్నవాడు ప్రేమ రాహిత్యం అనే జబ్బులేనివాడు సాదాసీదాగా ఉంటాడు. జనాన్ని పట్టించుకోకుండా తన ఆనందాన్ని తను వెతుక్కుంటాడు. ఓ ఆశ్రమంలో నెలకి వచ్చే పెన్షన్తో ఒకడు బతికేస్తుంటాడు. ఓ పార్టీలో బీపీ, సుగర్, గుండె జబ్బుతో కాళ్ళు ఈడ్చుకుంటూ ఆయాసపడుతూ వచ్చేవాళ్ళకి గొప్పకోసం ఓ లక్షెట్టి ఓ యాభైరకాలెట్టి భోజనాలు పెట్టడం ఇంకొకడి తీరు. అదే మంచి సందర్భంగా తీసుకుని ఆశ్రమాలకి వచ్చి ఆ వృద్ధుల్ని అనాధల్ని అపురూపంగా పళ్ళు స్వీట్లూ ఇచ్చి తమ పుట్టిన్రోజు అక్కడే జరుపుకుని ఆనందంగా వెళ్ళే వారు కొందరు. మన చుట్టూ అనేక రకాల మందుంటారు. వాడెవడో వాడికి తెలియక పోయినా మనకి తెలుస్తుంది. కానీ పిలిచాడు కదా మొహమాటానికెడతాం. ఎప్పుడోకప్పుడు వాడితో పనొస్తుందేమో అని భయం.