నాలుగు తరాలుగా హోటలంటే అలా ఉండాలి ఆ ఊరెడితే అక్కడ తిని తీరాలనే సంస్థలు నడిపిన మా కుటుంబం వ్యాపారంలోనే కాదు ఆదర్శాల్లోనూ పెద్దపీటే. స్వాతంత్ర్యసమరయోధులు, గాంధేయవాదులు. చదువు చదువుకోసమే ఉద్యోగం చెయ్యడానిక్కాదు అనేకమందికి ఉపాధి కల్పించడానికని నమ్మి నాకిష్టమైనవి చదివించినందుకు పుస్తకాల పురుగయ్యి ఆ వ్యాపారమే వదిలింతర్వాత మూడొందల అరవయ్యైదు రోజులూ, రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేసే వ్యాపకంలోంచి విడుదలయ్యాను. అమ్మ ఊహ ఎరిగి విశ్రాంతి తీసుకోవడం ఎరగను. పదో ఏట నుంచీ అందరికీ హోటల్ పనిలో శిక్షణ.

మనుషులు తమ ఇంద్రియాతీత శక్తులని అనుభవించి ఉపయోగించడం గ్రహాలు నక్షత్రసమూహాల ప్రభావాలు తమ శరీరం మనసుల మీద ప్రభావాన్ని వాటిలో ఉన్న ఆవృతాలని గణితాధ్యాయాయనం ద్వారా ఒక్క సంవత్సరంలో జరగలేదు. ఎటొచ్చీ ఆరోజున్న పరికారాలు తమ శరీరాలు, తమ సున్నితత్వం (అందరికీ అది ఉండదు) ఉపయోగించి చర్చించి అధ్యయనం చేసి ప్రామాణికం చేసిన ప్రక్రియ శతాబ్దాలు పట్టింది. తమకి మేలు కలిగించే క్షేత్రాలు కీడు కలిగించే క్షేత్రాలని కూడా గుర్తించి వాడడం మొదలుపెట్టారు. ఎటొచ్చీ ప్రపంచవ్యాప్తంగా వీటిలో అత్యంత ఉన్నతంగా సంస్కరించి ఆచరించిన సంస్కృతులలో భారతీయులే ముందున్నారు. కొన్ని సంస్కృతులు అంతరించాయి. ఋతుక్రమంలో క్షేత్రాల మీద మనుషులు మీద ప్రభావాన్ని గ్రహించి ఆ సమయంలో ఏం చేయాలో నిర్ణయించారు. మగవాళ్ళకీ చంద్రగమనం ప్రభావం ఉంటుంది కానీ ఇంత తీవ్రంగా ఉండదు. ఇదంతా హేతువాదులు గమనికలోకి తీసుకోరు పైగా వెటకారిస్తారు. అంటే వాళ్ళు నిజానికి హేతువాదులు కాదు. పరిశోధనలే చేయకుండా నమ్మను ( హేతువాది విశ్వాసం అనే మాట వాడడానికి వీలులేదు) అనడానికి వీల్లేదు. గుళ్ళునేవి హిందూ సంప్రదాయంలో శక్తి కేంద్రాలు. వాటిని నిర్వహించే విధానాలు నిశ్చితంగా ఉంటాయి. ఎటొచ్చీ పెద్దాళ్ళు చెప్పారు కనుక ఆచరించడం తప్ప అది తప్పో నిజమో నిర్ధారించడానికి ఈ క్షేత్రాలని గ్రహించే సామర్ధ్యం ఉన్న యోగి (ఉపనయనం) మాత్రమే చెప్పగలడు. వీళ్ళ సంఖ్య తక్కువ. పైగా వీళ్ళకి అధునాతన భౌతిక విజ్ఞానం మీద అవగాహన బొత్తిగా ఉండదు. పరిశోధనలని చేపట్టే ఆశక్తి ఉండదు. ఇందువల్ల హిందూమతం హేతువాదుల ప్రశ్నలకి సమాధానం చెప్పలేక సతమతం అవుతోంది. నాకు ఈ విషయంలో అనుభవం ఉంది కానీ అదే ప్రక్రియ ద్వారా సంభవించిందో ఇతరులకి సంక్రమించే సామర్ధ్యం లేదు. పైగా ఆ సామర్ధ్యం ఉన్నట్టు చాలా ఆలస్యంగా స్పష్టమైంది. ఐతే ఈ ప్రక్రియలూ సాధనలూ రహస్యాలేవీ కావు. చాలామంది హఠయోగులకి తమ గురువుల చేత శిక్షణ ఇవ్వబడేవే కానీ పరిచయం చేసిన తర్వాత పెద్దగా సాధన చెయ్యరు. చేసి ఉంటే గోగినేని లాంటి వాళ్ళకి కొన్ని వందలమంది ఏక కంఠంతో సమాధానాలిచ్చి ఉందురు. ఒక్క వ్యక్తి అనుభవాన్ని ప్రామాణికంగా స్వీకరించదు శాస్త్రీయత. మీకు గోగినేని లాంటి వాళ్ళని దూషించే బదులు సరైన హఠయోగసంప్రదాయంలో శిక్షణ పొంది అనుభవం పొంది సమాధానాలివ్వండి మీ అనుభవం విశ్వాసం ఇస్తుంది. మీ పిల్లలకి ముందు తరానికి విశ్వాసంతో సమాధానాలివ్వండి అవగాహన కల్పించండి.

సంప్రదాయ హిందువులు ఆచరంచే షోడశసంస్కారాలలో ఉపనయనం ఒక ప్రధానమైన ప్రక్రియ. ఇది