సోషల్మీడియా పోస్టు వినడం
తెలుగులో పోస్ట్ చదవడం కన్న వినగలిగితే బాగుండునన్న నా కోరిక రెండు దశాబ్దాల తర్వాత తీరింది. ఇప్పటిదాకా ప్రింటులో ఉన్న దాన్ని స్కాన్ చేస్తే దాన్ని గుర్తించి చదవడం కేవలం ఇంగ్లీషుకే పరిమితం. మన దేశంలో వీటి మీద్ సీ-డాక్ పరిశోధనలు నత్తనడకే. ఐతే విదేశీయులు ప్రధానంగా గూగుల్, మైక్రోసాఫ్ట్ సంస్థలు విశేషంగా పరిశోధనలకి కోట్లరూపాయలు వెచ్చించాయి. వాటి ఫలితాలు ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. నాకు భాషమీద ఏ పట్టూ లేదు కేవలం కంప్యూటర్, మైబైళ్ళ గురించి అంతర్జాలానికి ఏకలవ్య శిష్యుడిగా నేర్చుకున్న కొద్దిపాటి అవగాహనతో గూగుల్, గూటెన్'బర్గ్ లాంటి ప్రాజెక్టుల్లో తెలుగు కోసం కేటాయించిన ప్రాజెక్టుల్లో ఉడతాభక్తిగా సేవ చేసాను. ఇక విషయానికొస్తాను. ఈ పోస్ట్ తెలుగులోకి యాంత్రికంగా చదివించగలిగాను. ఆసక్తి కలవారు చూడండి. ఈ లింకులో https://jmp.sh/q18v9BaW